‘సంబంధం లేదనడం… విడ్డూరంగా ఉంది’

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై, టీడీపీ నేత కూన రవికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సోమేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ ఐడీలు క్రియేట్‌ చేసి అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో తిరుగుతూ.. స్పీకర్ పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. అయితే దీనిపై అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు స్పందిస్తూ, సోమేశ్వరరావు అనే వ్యక్తి ఎవరో తెలియదని, స్పీకర్‌కు అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. […]

Update: 2020-09-14 05:56 GMT
‘సంబంధం లేదనడం… విడ్డూరంగా ఉంది’
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై, టీడీపీ నేత కూన రవికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సోమేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ ఐడీలు క్రియేట్‌ చేసి అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో తిరుగుతూ.. స్పీకర్ పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. అయితే దీనిపై అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు స్పందిస్తూ, సోమేశ్వరరావు అనే వ్యక్తి ఎవరో తెలియదని, స్పీకర్‌కు అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

సోమేశ్వరరావు ఎవరో తెలియనప్పుడు అతనిపై ఎందుకు ఫిర్యాదులు చేయడం లేదని ప్రశ్నించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం.. అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి సోమేశ్వరరావు ద్వారా డబ్బులు వసూలు చేశారని ప్రజలు మాట్లాడుతున్నారని రవికుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియోను రవికుమార్ మీడియా ముందుంచారు.

Read Also..

పథకాల్లో 85శాతం హిందువులకే లబ్ధి..!

Full View

Tags:    

Similar News