కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు : బండి సంజయ్

దిశ, భద్రాచలం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భద్రాద్రి రామాలయాన్ని సందర్శించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయనకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భద్రాద్రి దేవాలయం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఇస్తామన్న రూ.100 కోట్లు ఏమైనాయని ప్రశ్నించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అభివృద్ధిని కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రిగా […]

Update: 2021-03-08 04:30 GMT

దిశ, భద్రాచలం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భద్రాద్రి రామాలయాన్ని సందర్శించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయనకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భద్రాద్రి దేవాలయం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఇస్తామన్న రూ.100 కోట్లు ఏమైనాయని ప్రశ్నించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అభివృద్ధిని కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, బీజేపీ జిల్లా నాయకులు ఎర్రంరాజు, రామ్మోహన్‌రావు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News