ప్రభుత్వ నిర్లక్ష్యమే… వాటికి కారణం

దిశ, పటాన్‌చెరు: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వం అసమర్ధ పాలన వల్ల ఇలాంటి ఘటన జరుగుతున్నాయని బీజేపీ రాష్ట నాయకులు అదెల్లి రవీందర్ విమర్శించారు. శుక్రవారం బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రశాంతితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యం ఎదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు. అత్యాచారానికి పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రశాంతి మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలకు […]

Update: 2020-08-28 07:03 GMT

దిశ, పటాన్‌చెరు: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వం అసమర్ధ పాలన వల్ల ఇలాంటి ఘటన జరుగుతున్నాయని బీజేపీ రాష్ట నాయకులు అదెల్లి రవీందర్ విమర్శించారు. శుక్రవారం బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రశాంతితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో నిత్యం ఎదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు. అత్యాచారానికి పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రశాంతి మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News