మంత్రి తలసాని ఇలాకాలో బీజేపీ జోరు!
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిష్టాత్మకమైన డివిజన్ మోండా మార్కెట్‌లో బీజేపీ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. గతంలో మోండా మార్కెట్ డివిజన్ నుంచి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కూడా కార్పొరేటర్‌లుగా పోటీ చేశారు. ఈ డివిజన్ వీరిద్దరికీ ప్రతిష్టాత్మకమైనదే. ప్రస్తుతం 150 డివిజన్ అయిన మోండా మార్కెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల రూప, […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిష్టాత్మకమైన డివిజన్ మోండా మార్కెట్‌లో బీజేపీ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. గతంలో మోండా మార్కెట్ డివిజన్ నుంచి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కూడా కార్పొరేటర్‌లుగా పోటీ చేశారు. ఈ డివిజన్ వీరిద్దరికీ ప్రతిష్టాత్మకమైనదే.
ప్రస్తుతం 150 డివిజన్ అయిన మోండా మార్కెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల రూప, బీజేపీ అభ్యర్థి కె.దీపికకు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ కు ఇక్కడ మంచి పట్టు ఉన్నది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానికులు బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కారణం మంత్రి ఆ డివిజన్ ను పట్టించుకోకపోవడమే అని తెలుస్తోంది.దీంతో అధికార పార్టీ మీద వ్యతిరేకత కాస్త కాషాయ పార్టీకి ప్లస్ అయినట్టు సమాచారం.