కేసీఆర్ నిజాంలా వ్యవహరిస్తున్నారు: వివేక్

దిశ, వరంగల్: సీఎం కేసీఆర్ నిజాంలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు. ‌విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ముందు నిరసన తెలుపుతున్న వివేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కరోనా టైమ్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు‌. అదనపు విద్యుత్ చార్జీల పేరుతో రూ.800 కోట్ల భారం […]

Update: 2020-06-15 03:30 GMT

దిశ, వరంగల్: సీఎం కేసీఆర్ నిజాంలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు. ‌విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ముందు నిరసన తెలుపుతున్న వివేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కరోనా టైమ్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు‌. అదనపు విద్యుత్ చార్జీల పేరుతో రూ.800 కోట్ల భారం మోపిందన్నారు. రూ. 300 బిల్లు వచ్చే వాళ్లకు రూ.3వేలు వేశారని ఆరోపించారు. విద్యుత్ బిల్లులపై వారంరోజులుగా పోరాటం చేస్తున్న సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Tags:    

Similar News