ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తున్న బీజేపీ

కోల్‌కత: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే 80 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ఆదివారం ఫైనల్ చేయనుంది. రాష్ట్రంలో మూడవ, నాల్గో విడత ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసేందుకు ఆ పార్టీ నేతలు ఈ రోజు భేటీ కానున్నారు. కాగా 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే 58 […]

Update: 2021-03-14 00:58 GMT

కోల్‌కత: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే 80 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ఆదివారం ఫైనల్ చేయనుంది. రాష్ట్రంలో మూడవ, నాల్గో విడత ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసేందుకు ఆ పార్టీ నేతలు ఈ రోజు భేటీ కానున్నారు.

కాగా 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే 58 మంది జాబితాను బీజేపీ ఇప్పటికే విడుదల చేసింది. మొదటి విడత జాబితాలో మమతా బెనర్జీ కుడిభుజం, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన సువేందు అధికారి పేరును ప్రకటించారు. ఇక అస్సోం, కేరళలొ పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News