దొంగిలించలేదు.. సాయం చేశామంతే..

గువహతి: అసోంలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలి కారులో ఈవీఎంలను తరలించిన వివాదంపై బీజేపీ అభ్యర్థి క్రిష్ణేందు పాల్ స్పందించారు. ఈ ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకుని రాతాబరి సీటులోని 179వ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిష్ణేందు మాట్లాడుతూ.. ఈవీఎంలను దొంగిలించలేదని, సాయం మాత్రమే చేశామని వివరణ ఇచ్చారు. ‘నా భార్య కారు డ్రైవర్ అందులో కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన పోలింగ్ అధికారులు అతడిని సాయం కోరారు. […]

Update: 2021-04-02 06:33 GMT

గువహతి: అసోంలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలి కారులో ఈవీఎంలను తరలించిన వివాదంపై బీజేపీ అభ్యర్థి క్రిష్ణేందు పాల్ స్పందించారు. ఈ ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకుని రాతాబరి సీటులోని 179వ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిష్ణేందు మాట్లాడుతూ.. ఈవీఎంలను దొంగిలించలేదని, సాయం మాత్రమే చేశామని వివరణ ఇచ్చారు. ‘నా భార్య కారు డ్రైవర్ అందులో కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన పోలింగ్ అధికారులు అతడిని సాయం కోరారు. ఆ కారు మీద అప్పటికే నేను బీజేపీ అభ్యర్థినన్న స్టిక్కర్ కూడా అంటించి ఉంది. మరి పోలింగ్ అధికారులు దానిని చూశారో లేదో నాకు తెలియదు. మేం సాయం చేశామంతే’ అని క్రిష్ణేంద్ర చెప్పారు.

కాగా.. ఈ ఘటనలో నలుగురు ఎన్నికల అధికారులను ఈసీ సస్పెండ్ చేసిన విషయం విదితమే.

Tags:    

Similar News