మంచంపై గర్భిణీని 5 కి.మీ. మోసుకెళ్లిన ఎమ్మెల్యే
ఎన్నికలకు ముందు మందిలో తిరిగి.. గెలవగానే సెక్యూరిటీ మధ్య తిరిగే ఎమ్మెల్యే కాదు ఆయన. సమస్య వస్తే నేరుగా ప్రజల దరిచేరి సాయం చేసేందుకు ముందుపడ్డాడు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. పురిటినొప్పులు పడుతున్న గర్భిణిని మంచంపై ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లి.. తర్వాత తన వాహనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి నాయకత్వ లక్షణాన్ని చాటుకున్నారు. ఆయనే ఒడిశాలోని డాబుగాం నియోజకవర్గ ఎమ్మెల్యే మన్హర్ రాంధారి. నబరంగ్ పూర్ జిల్లా కుసుమకుంతి గ్రామానికి సక్రమ రోడ్డు […]
ఎన్నికలకు ముందు మందిలో తిరిగి.. గెలవగానే సెక్యూరిటీ మధ్య తిరిగే ఎమ్మెల్యే కాదు ఆయన. సమస్య వస్తే నేరుగా ప్రజల దరిచేరి సాయం చేసేందుకు ముందుపడ్డాడు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. పురిటినొప్పులు పడుతున్న గర్భిణిని మంచంపై ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లి.. తర్వాత తన వాహనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి నాయకత్వ లక్షణాన్ని చాటుకున్నారు. ఆయనే ఒడిశాలోని డాబుగాం నియోజకవర్గ ఎమ్మెల్యే మన్హర్ రాంధారి.
నబరంగ్ పూర్ జిల్లా కుసుమకుంతి గ్రామానికి సక్రమ రోడ్డు మార్గం లేదు. ఆస్పత్రికి వెళ్లాలంటే వాగులు వంకలు, గుట్టలు దాటుతూ కనీసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిందే. కుసుమంతి గ్రామానికి చెందిన జేమా బెహెరీ అనే గర్భిణికి సోమవారం పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ, సరైన మార్గం లేకపోవడంతో అక్కడికి చేరలేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న బీజేడీ ఎమ్మెల్యే మన్హర్ రాంధారి నేరుగా అక్కడికి చేరుకున్నారు. గర్భిణిని మంచంపై వేసుకుని ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లారు. అనంతరం అక్కడ రెడీగా ఉన్న తన వాహనంలో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.