‘కోహ్లీ, తమన్నాలను వెంటనే అరెస్టు చేయండి’
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి తమన్నాలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ ఆన్‌లైన్ గాంబ్లింగ్ యాప్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ వాటిని ప్రచారం చేస్తున్నారని, దీని ద్వారా యువత పెడదోవ పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని సదరు యాప్స్‌ను నిషేధించడమే కాకుండా, వాటికి ప్రచారం చేస్తున్న వారిద్దరినీ అరెస్టు చేయాలని చెన్నైకి […]
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి తమన్నాలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ ఆన్‌లైన్ గాంబ్లింగ్ యాప్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ వాటిని ప్రచారం చేస్తున్నారని, దీని ద్వారా యువత పెడదోవ పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని సదరు యాప్స్‌ను నిషేధించడమే కాకుండా, వాటికి ప్రచారం చేస్తున్న వారిద్దరినీ అరెస్టు చేయాలని చెన్నైకి చెందిన సూర్యప్రకాష్ ఆ పిటిషన్‌లో కోరారు. ఇలాంటి గ్యాంబ్లింగ్‌ల ఉచ్చులో పడి ఎంతోమంది మోసపోతున్నారని, కొంత మంది ఆత్మహత్యలూ చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కాగా, కోహ్లీ, తమన్నా ఈ మధ్య ఒక క్రికెట్ గేమింగ్ యాప్‌కు ప్రచారకర్తలుగా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ యాప్ ఫాంటసీ లీగ్స్‌ను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇలాంటి ఒక యాప్‌కు ప్రచారకర్తగా ఉండటం గమనార్హం.