క్రికెట్ ప్రపంచంలోని అందాల రాణి పుట్టినరోజు

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మహిళా క్రికెటర్లు అనగానే అందరికీ ఉన్నపళంగా గుర్తొచ్చే పేరు స్మృతి మంధనా. అందంతో, ఆటతో ప్రపచంలో క్రికెట్‌లో ఎంతోమంది అభిమానులను ఆమె సంపాదించుకున్నారు. 1996లో ముంబైలో జన్మించిన మందనా 2013లో ప్రపంచ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. 2014లో టెస్ట్‌లో మొదటి టెస్ట్ మ్యా్చ్ ఆడింది. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే అటు మైదానంలో, ఇటు బయట అపారమైన ప్రజాదరణ పొందింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో అత్యుత్తమ చేయగల మందనా, 2018 ఉమెన్స్ టీ20 ప్రపంచ […]

Update: 2021-07-17 21:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మహిళా క్రికెటర్లు అనగానే అందరికీ ఉన్నపళంగా గుర్తొచ్చే పేరు స్మృతి మంధనా. అందంతో, ఆటతో ప్రపచంలో క్రికెట్‌లో ఎంతోమంది అభిమానులను ఆమె సంపాదించుకున్నారు. 1996లో ముంబైలో జన్మించిన మందనా 2013లో ప్రపంచ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. 2014లో టెస్ట్‌లో మొదటి టెస్ట్ మ్యా్చ్ ఆడింది. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే అటు మైదానంలో, ఇటు బయట అపారమైన ప్రజాదరణ పొందింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో అత్యుత్తమ చేయగల మందనా, 2018 ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 178 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకూ 59 వన్డేలు ఆడిన ఈమె 41.72 సగటుతో 2253 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతేగాకుండా.. 81 టీ20 మ్యాచ్‌లు ఆడి 13 అర్ధ సెంచరీలు సాధించి, మొత్తం 1901 పరుగులు చేసింది. కాగా, ఇప్పటివరకూ కేవలం మూడే టెస్టులు ఆడిన మందనా 2 అర్ధ సెంచరీలతో 167 పరుగులు చేసింది.

స్మృతి తండ్రి, సోదరుడు జిల్లా స్థాయి క్రికెట్‌లో అద్భుతంగా రాణించారు. అన్నయ్యను ఆటను చూసిన మందనా క్రికెటర్ కావాలని కలలు కనింది. ఆమెకు ఇష్టమైన క్రికెటర్ శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర. సంగక్కర బ్యాటింగ్ స్టైల్‌ నేర్చుకున్నానని పలుమార్లు చెప్పింది. కాగా, వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన భారత తొలి క్రీడాకారిణి స్మృతి మంధనా. గుజరాత్‌పై 150 బంతుల్లో 224 పరుగులు చేసింది. స్మృతి బ్యాటింగ్‌కు ఫిదా అయిన రాహుల్ ద్రవిడ్ తన బ్యాట్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఫిబ్రవరి 2019లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 తర్వాత ఓ సిరీస్‌కు మందనా హీరోయిన్‌గా ఎంపికైంది. చాలా చిన్న వయస్సులోనే నాయకత్వం వహించిన మొదటి భారత మహిళా అథ్లెట్ మందనా. క్రికెట్ ప్రపంచంలోని అందాల రాణిగా, స్మృతికి సోషల్‌‌మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

https://twitter.com/ICC/status/1416586036596117516?s=20

Tags:    

Similar News