ధోనీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారానికి బ్రేక్

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారానికి చుక్కెదురైంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత ఎంతో ఆసక్తిగా సొంత ఫామ్‌హౌస్‌లో కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని మొదలు పెట్టాలనుకున్న ధోనీ.. 2020 ఆగస్టులో కడక్‌నాథ్ 2వేల కోడి పిల్లలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బర్డ్‌ ప్లూ ధోనీ వ్యాపారానికి బ్రేక్ వేసింది. మధ్యప్రదేశ్‌‌లోని ఓ రైతుకు ధోనీ ఫామ్‌హౌస్ మేనేజర్ ఆర్డర్ ఇచ్చిన […]

Update: 2021-01-13 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారానికి చుక్కెదురైంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత ఎంతో ఆసక్తిగా సొంత ఫామ్‌హౌస్‌లో కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని మొదలు పెట్టాలనుకున్న ధోనీ.. 2020 ఆగస్టులో కడక్‌నాథ్ 2వేల కోడి పిల్లలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బర్డ్‌ ప్లూ ధోనీ వ్యాపారానికి బ్రేక్ వేసింది. మధ్యప్రదేశ్‌‌లోని ఓ రైతుకు ధోనీ ఫామ్‌హౌస్ మేనేజర్ ఆర్డర్ ఇచ్చిన ఫౌల్ట్రీలో బర్డ్ ప్లూ నిర్ధారణ కావడంతో కోళ్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి కోళ్లను స్వాధీనం చేసుకొని పూడ్చిపెట్టింది.

Tags:    

Similar News