నెట్టింటా వైరల్ అవుతోన్న BINOD

దిశ, వెబ్ డెస్క్ : సామాజిక మాద్యమాల్లో రోజుకో టాపిక్ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా నెట్టింటా ‘బినోద్’ (BINOD) అనే పేరు వైరల్‌గా మారింది. ఇంకేముంది ట్విట్టర్‌ (twitter)లో చాలా మంది హాష్‌ట్యాగ్ పెట్టి షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా పేటీఎం (paytm)పేరును బినోద్ (BINOD) అని పేరు మార్చారనే టాపిక్ వైరల్ అవుతోంది. కారణం ఈ ‘స్లే పాయింట్’ అనే యూట్యూబ్ చానల్‌లో ఈ తతంగం అంతా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ చానల్ నిర్వహిస్తున్న ‘బినోద్ […]

Update: 2020-08-08 09:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : సామాజిక మాద్యమాల్లో రోజుకో టాపిక్ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా నెట్టింటా ‘బినోద్’ (BINOD) అనే పేరు వైరల్‌గా మారింది. ఇంకేముంది ట్విట్టర్‌ (twitter)లో చాలా మంది హాష్‌ట్యాగ్ పెట్టి షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా పేటీఎం (paytm)పేరును బినోద్ (BINOD) అని పేరు మార్చారనే టాపిక్ వైరల్ అవుతోంది. కారణం ఈ ‘స్లే పాయింట్’ అనే యూట్యూబ్ చానల్‌లో ఈ తతంగం అంతా జరిగిందని చెప్పుకోవచ్చు.

ఈ చానల్ నిర్వహిస్తున్న ‘బినోద్ దారు’ వ్యక్తి పోస్టు చేసే వీడియోలకు చాలా కామెంట్లు వస్తుంటాయి. వాటిని బేస్ చేసుకుని సెటైర్లు పేలుస్తూ ఓ ఫన్నీ ఫ్రస్ట్రేషన్ వీడియోను అతను రూపొందించారు. ‘Why Indian Comments Section is Garbage (BINOD)’ అనే టైటిల్‌ పేరుతో ఈ వీడియోను పోస్టుచేశారు.

ఆ వీడియోకు వచ్చే కామెంట్లను తట్టుకోలేక కొందరు నెటిజన్లు బినోద్ దారుతో ఈ విషయాన్ని పంచుకున్నారు. అతను దానికి రిప్లే‌గా బినోద్ (BINOD)అని పెట్టాడు.
అతను పెట్టిన ‘బినోద్’ అనే కామెంట్‌ను ఎవరూ, ఎందుకు లైక్ చేశారో గానీ తెలీదు.. మొత్తం ఏడుగురు చేశారు. దాంతో అప్పటినుంచి నెటిజన్స్ ‘బినోద్’ అనే పేరును ట్విటర్‌లోకి హ్యాష్‌ట్యాగులు పెడుతూ వైరల్ చేసేశారు.

ఇదిలాఉండగా మరో నెటిజన్ ‘పేటీఎం’ తన పేరును ‘బినోద్’గా మార్చుకున్నారని పెద్ద సవాలే విసిరాడు. అది విన్నాక నెటిజన్స్ ఇదేంటంటూ షాక్ అవుతున్నారు. అంతే కాకుండా నాగపూర్‌, ముంబై పోలీసులు సైతం ‘బినోద్’ పేరును వాడేసుకున్నారు. ఎలా అంటే తమకు వచ్చే కామెంట్ల స్థానంలో ఈ పేరును వాడేస్తున్నారు.

Tags:    

Similar News