బిల్ గేట్స్ అల్లుడిగా ముస్లిం ధనవంతుడు
ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌కి ఓ ముస్లిం ధనవంతుడు అల్లుడిగా రాబోతున్నాడు. 23 ఏళ్ల గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ కేథరీన్ గేట్స్, ఈజిప్టుకి చెందిన 28 ఏళ్ల నాయెల్ నాజర్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ప్రకటించింది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీళ్లిద్దరూ తమ ప్రేమను చల్లని మంచు మధ్య పెళ్లి వరకు తీసుకెళ్లిన క్షణాలను వారి వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పంచుకున్నారు. […]
ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌కి ఓ ముస్లిం ధనవంతుడు అల్లుడిగా రాబోతున్నాడు. 23 ఏళ్ల గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ కేథరీన్ గేట్స్, ఈజిప్టుకి చెందిన 28 ఏళ్ల నాయెల్ నాజర్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ప్రకటించింది.
కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీళ్లిద్దరూ తమ ప్రేమను చల్లని మంచు మధ్య పెళ్లి వరకు తీసుకెళ్లిన క్షణాలను వారి వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పంచుకున్నారు. తను ఊహించని రీతిలో నాజర్ ప్రపోజ్ చేసి తనను ఆశ్చర్యపరిచాడని, తాను అంగీకరించకుండా ఉండలేకపోతున్నానని కేథరీన్ పేర్కొనగా, ఆమె అంగీకరించిందంటూ నాజర్ తన ప్రేమను తెలియజేసే పోస్టులు చేశారు.
ఈజిప్టు దేశ ముస్లిం కుటుంబానికి చెందిన నాజర్ వృత్తిపరంగా హార్స్ రైడర్, వారి కుటుంబానికి కువైట్ దేశంలో ఆర్కిటెక్చర్, డిజైన్ వ్యాపారాలు ఉన్నాయి. నాజర్, కేథరీన్‌లు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. వచ్చే ఏడాది లోగా వీళ్ల పెళ్లి జరిగిపోవచ్చని సమాచారం.