'హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా'.. ఎందుకా పేరొచ్చిందంటే..?
దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్చంద సంస్థలు చెబుతూ ఉన్నా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం వేలకొద్ది ప్రమాదాలు జరిగి వందల ప్రాణాలు పోతున్నా మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరిస్తే, ప్రమాదం జరిగినప్పుడు మరణం నుంచి తప్పించుకోవచ్చన్న విషయం తెలసినా ఎవరు ఆచరించడం లేదు. అయితే ఇలాంటి వారికి అవగాహన కల్పించే విధంగా బీహార్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాఘవేంద్ర […]
దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్చంద సంస్థలు చెబుతూ ఉన్నా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం వేలకొద్ది ప్రమాదాలు జరిగి వందల ప్రాణాలు పోతున్నా మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరిస్తే, ప్రమాదం జరిగినప్పుడు మరణం నుంచి తప్పించుకోవచ్చన్న విషయం తెలసినా ఎవరు ఆచరించడం లేదు. అయితే ఇలాంటి వారికి అవగాహన కల్పించే విధంగా బీహార్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాఘవేంద్ర కమార్ విన్నూత ఆలోచన చేపట్టాడు. ఈయన ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా రోడ్డెక్కిన ద్విచక్ర వాహనదారులకు 49 వేల ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్ లు అందించారు.
ఏడేళ్ల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన బైక్ ప్రమాదంలో తన స్నేహితుడు కేకే ఠాకూర్ ను కోల్పోయానని, ప్రమాదం జరిగినపుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఠాకూర్ చనిపోయారని కుమార్ తెలిపారు. ఆయనలా మరెవరూ చనిపోవొద్దని నిర్ణయించుకుని దేశంలోని పలు వివిధ ప్రాంతాలకు తిరుగుతూ హెల్మెట్ లు అందిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకూ 22 రాష్ట్రాల్లో పర్యటించి 49,272 హెల్మెట్లు వాహనదారులకు అందించినట్లు కుమార్ ప్రకటించారు. వీటిని కొనుగోలు చేసేందుకు రూ.2 కోట్లు ఖర్చయిందని, నిధుల కోసం తనకున్న భూములు, ఇంటిని అమ్మేశానని ఆయన తెలిపారు.
కేకే ఠాకూర్ సేవలకు ‘‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’’ గా గుర్తించారు. అయితే ఇలా మరిన్ని చోట్ల హెల్మెట్లు అందించేందుకు నిధుల కొరత ఉందని, భారతదేశాన్ని ప్రమాద రహిత దేశంగా మార్చడానికి కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద తనకు హెల్మెట్‌లను విరాళంగా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కుమార్ గురించి తెలుసుకున్న నటుడు సోనూ సూద్ హోస్ట్ గా ఉన్న జీఎన్‌టీ ఆజ్ తక్ టీవీ ఛానల్ లోని ఓ ప్రోగ్రాంకి హెల్మెట్ మ్యాన్ ని ఆహ్వానించారు. అయితే ఈయన చేస్తున్న సేవల గురించి సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేయగా.. ఆయన స్పందిస్తూ ‘‘రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించేందుకు నా స్టోరీని షేర్ చేసినందుకు ధన్యావాదాలు’’ అని ట్వీట్ చేశారు.
https://twitter.com/helmet_man_/status/1437453700637757440?s=19