ఈ నెల 15న బిహార్ సీఎం ఖరారు!
పాట్నా: బిహార్ రాష్ట్రంలో అధికారానికి అవసరమైన మెజార్టీ సాధించిన ఎన్‌డీఏ తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక కోసం ఈ నెల 15న సమావేశం కానున్నది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్‌డీఏ భాగస్వామ్యం పక్షాలు సమావేశమై నిర్ణయం తీసుకుంటాయని జేడీయూ అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎన్‌డీఏ శాసనసభా పక్షం సమావేశమై అన్ని విషయాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నదని ఆయన చెప్పారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. బిహార్‌లో అవసరమైన […]
పాట్నా: బిహార్ రాష్ట్రంలో అధికారానికి అవసరమైన మెజార్టీ సాధించిన ఎన్‌డీఏ తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక కోసం ఈ నెల 15న సమావేశం కానున్నది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్‌డీఏ భాగస్వామ్యం పక్షాలు సమావేశమై నిర్ణయం తీసుకుంటాయని జేడీయూ అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎన్‌డీఏ శాసనసభా పక్షం సమావేశమై అన్ని విషయాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నదని ఆయన చెప్పారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. బిహార్‌లో అవసరమైన మెజార్టీని ఏన్‌డీఏ సాధించింది. కానీ, బీజేపీ(74) అత్యధిక స్థానాలు వచ్చాయి. జేడీయూ 43 రాగా, హెచ్‌ఏఎం, వీఐపీలకు ఎనిమిది సీట్లు వచ్చాయి. ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే.