బిగ్ బ్రేకింగ్ : ఉద్యోగుల పదోన్నతులపై సర్కార్ కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు తీపి కబురు తెలిపింది. పదోన్నతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదోన్నతికి కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి పదోన్నతుల కోసం రెండేండ్ల సర్వీసును పరిగణలోకి తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు తీపి కబురు తెలిపింది. పదోన్నతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదోన్నతికి కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి పదోన్నతుల కోసం రెండేండ్ల సర్వీసును పరిగణలోకి తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మామిళ్ల రాజేందర్, ప్రతాప్, మమత, ఏనుగుల సత్యనారాయణ, గండూరి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణ యాదవ్, రవీందర్ రావు, రవీంద్ర కుమార్, లక్ష్మణ్ గౌడ్, హరికృష్ణ, ఉపాధ్యాయ సంఘం నేతలు మణిపాల్‌రెడ్డి తదితరులు ధన్యవాదాలు తెలిపారు.