దుమ్ములేపుతున్న.. దుర్గారావు
దిశ, వెబ్‌డెస్క్ : ‘నువ్వు ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు.. మొదట అందరూ నిన్ను విస్మరిస్తారు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, ఆపై నీతో పోరాడతారు. విజయం నీ దరిచేరాక నిన్ను మెచ్చుకోవడమే కాదు, నిన్ను ఓ ఉదాహరణగా తీసుకుంటారు’.. ఈ వాక్యాలన్నీ అక్షరాల దుర్గారావుకు వర్తిస్తాయి. దుర్గారావా? ‘హూ ఈజ్ హీ’ అంటారా? టిక్‌టాక్ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. జజర్దస్త్, అదిరింది వంటి కామెడీ షోస్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇంకా కొంతమంది దుర్గారావు ఎవరంటూ […]
దిశ, వెబ్‌డెస్క్ :
‘నువ్వు ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు.. మొదట అందరూ నిన్ను విస్మరిస్తారు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, ఆపై నీతో పోరాడతారు. విజయం నీ దరిచేరాక నిన్ను మెచ్చుకోవడమే కాదు, నిన్ను ఓ ఉదాహరణగా తీసుకుంటారు’.. ఈ వాక్యాలన్నీ అక్షరాల దుర్గారావుకు వర్తిస్తాయి. దుర్గారావా? ‘హూ ఈజ్ హీ’ అంటారా? టిక్‌టాక్ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. జజర్దస్త్, అదిరింది వంటి కామెడీ షోస్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇంకా కొంతమంది దుర్గారావు ఎవరంటూ వెతుకుతుండగా.. ఇప్పుడు దుర్గారావు వెతక్కుండానే బుల్లితెర సెలెబ్రిటీ స్థాయికి ఎదిగాడు.
దుర్గారావుకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ అతనేమీ తన స్టెప్పులతో మెస్మరైజ్ చేయలేడు. గొప్ప అందగాడేం కాదు, పొగిడేంత ఫిజిక్ కూడా లేదు. కానీ ఆరడుగుల పొడవుంటాడు. పైగా హైట్ ఎక్కువగా ఉంటే.. డ్యాన్స్ చేయడం కాస్త ఇబ్బందనే చెప్పాలి. ఇవన్నీ ఎదుటి వాళ్లకు కనిపించే మైనస్ పాయింట్లు. కానీ దుర్గారావు మాత్రం అవన్నీ పట్టించుకోలేదు. ఏదో చేయాలన్న అతడి ప్యాషన్‌కు.. టిక్‌టాక్ తోడైంది. తెలుగు పాటలకు తనదైన స్టైల్లో డ్యాన్స్‌లు వేస్తూ రెచ్చిపోయాడు. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉన్నట్లే.. దుర్గారావు భార్య కూడా అతడికి అండగా నిలిచింది. అతడితో కలిసి స్టెప్పులేసింది. ఇద్దరూ.. టిక్‌టాక్‌లో వెరైటీ వెరైటీ గెటప్‌లతో కుమ్మేశారు. మొదట.. ‘వీడెవడ్రా బాబు పిచ్చోడిలా ఉన్నాడే’ అని చాలామంది హేళన చేశారు. కానీ మెల్లమెల్లగా.. దుర్గారావుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కొన్ని నెలల్లోనే టిక్‌టాక్ సంచలనంగా ఎదిగాడు. ‘దుర్గారావు నాట్య మండలి’ పేరుతో టిక్‌టాక్‌లో కొన్ని వందల వీడియోలు చేసి నెటిజన్లను తన వైపుకు తిప్పుకున్నాడు. టిక్‌టాక్ బ్యాన్ అయినప్పటికీ.. దుర్గారావు మాత్రం తమ వీడియోలను ఆపలేదు. ఇఫ్పుడు యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకొని వీడియోలు చేస్తూ.. తమ ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాడు.
పాపులారిటీ వచ్చిన తర్వాత.. ప్రధాన స్రవంతి మీడియా ఊరికే ఉంటుందా? దుర్గారావుకు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికింది. ‘ఢీ’ షోలో ‘నాది నక్కిలీసు గొసుసు’ సాంగ్‌లో టిక్‌టాక్ దుర్గారావు సిగ్నేచర్ స్టెప్పుల్ని వాడటంతో.. మరింత ఫేమస్ అయిపోయాడు. ఢీ చాంపియన్స్ ‘పండు’ లేడీ గెటప్‌లో నక్కిలీసు గొలుసు (పలాస చిత్రం) పాటకు చేసిన పెర్ఫామెన్స్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. ఈ పాటకు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.. దుర్గారావు స్టెప్పే అంటే, అతిశయోక్తి కాదు. తర్వాత ప్రతివారం ఒక కొత్త సెలబ్రిటీని తన స్కిట్‌లోకి తీసుకుని వచ్చే హైపర్ ఆది ఈసారి టిక్‌టాక్ దుర్గారావును స్టేజ్ మీదికి తీసుకొచ్చాడు. అక్కడ కూడా దుర్గారావు తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. అంతేకాదు, మరికొన్ని రోజుల్లో జబర్ధస్త్ టీమ్‌లోకి రాబోతున్న దుర్గారావు.. తెలుగు ప్రేక్షకులకు నవ్వులు కూడా పంచబోతున్నాడు.
ఇది అలా ఉంటే, మరో కామెడీ షో ‘అదిరింది’లోకి కూడా దుర్గారావు ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఇక్కడ దుర్గారావు ఎంట్రీ కోసం ఏకంగా డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ రావడం విశేషం. బాబా భాస్కర్ మాస్ స్టెప్పులతో ఎంతగా ఎంటర్‌టైన్ చేసినా.. జనాలు పట్టించుకోరు. కానీ దుర్గారావు.. కేవలం వేలు ఊపితేనే, పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. దాంతో బాబా భాస్కర్ అసలు ఈ దుర్గారావు ఎవరు? అంటూ అరుస్తాడు. అలా అదిరిందిలోనూ అదిరిపోయే ఎంట్రీ దక్కింది దుర్గారావుకు.
ఈ నేపథ్యంలో టిక్‌టాక్ నుంచి బుల్లితెర వరకు దుర్గారావు అనే ఓ సామాన్యుడు.. అసామాన్యంగా ఎదగడం నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.