మోడీకి బైడెన్ ఇన్విటేషన్

న్యూఢిల్లీ: ఈ నెలలో నిర్వహించే పర్యావరణ సదస్సులో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఈ ఇన్విటేషన్‌ను ప్రధాని మోడీ యాక్సెప్ట్ చేశారు. ఈ నెల 22, 23వ తేదీల్లో అమెరికా సారథ్యంలోని ఎకనామిస్ ఫోరమ్ ఆన్‌లైన్‌లో ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు కోసం భారత ప్రధాని సహా 40 మంది నేతలను బైడెన్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించినట్టు ప్రధానమంత్రి మోడీ ఓ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. బైడెన్ […]

Update: 2021-04-03 06:40 GMT

న్యూఢిల్లీ: ఈ నెలలో నిర్వహించే పర్యావరణ సదస్సులో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఈ ఇన్విటేషన్‌ను ప్రధాని మోడీ యాక్సెప్ట్ చేశారు. ఈ నెల 22, 23వ తేదీల్లో అమెరికా సారథ్యంలోని ఎకనామిస్ ఫోరమ్ ఆన్‌లైన్‌లో ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు కోసం భారత ప్రధాని సహా 40 మంది నేతలను బైడెన్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించినట్టు ప్రధానమంత్రి మోడీ ఓ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

బైడెన్ నిర్ణయాన్ని స్వాగతించారని కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. ఈ సదస్సుపై చర్చలు జరపడానికి యూఎస్ స్పెషల్ ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్ జాన్ కెర్రీ ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నట్టు వివరించారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ కానున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News