టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం చీకటి జీవోను తీసుకొచ్చిందని విమర్శించారు. 30 నుంచి 40 సంవత్సరాల లేఔట్‌లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలని తెలిపారు. ఎల్‌ఆర్ఎస్‌పై హైకోర్టులో పిల్ దాఖలు చేశానని స్పష్టం చేశారు. అంతేగాకుండా దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని కూడా వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.3లక్షల కోట్లు వస్తాయని […]

Update: 2020-10-05 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం చీకటి జీవోను తీసుకొచ్చిందని విమర్శించారు. 30 నుంచి 40 సంవత్సరాల లేఔట్‌లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలని తెలిపారు. ఎల్‌ఆర్ఎస్‌పై హైకోర్టులో పిల్ దాఖలు చేశానని స్పష్టం చేశారు. అంతేగాకుండా దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని కూడా వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.3లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని ఎద్దేవా చేశారు. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News