ఆయనకు తెలియక ఛాలెంజ్ చేశారు.
దిశ వెబ్ డెస్క్: డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో లెక్కలు కాగితాలపై ఒకలా క్షేత్ర స్థాయిలో మరోలా ఉంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ…జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని ఆయన అన్నారు. అయితే 3428 ఇండ్లను మాత్రమే తనకు చూపించారని ఆయన తెలిపారు. కేటీఆర్ చెప్పినట్టు లక్ష ఇండ్ల నిర్మాణం జరగలేదనీ, […]
దిశ వెబ్ డెస్క్:
డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో లెక్కలు కాగితాలపై ఒకలా క్షేత్ర స్థాయిలో మరోలా ఉంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ…జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని ఆయన అన్నారు. అయితే 3428 ఇండ్లను మాత్రమే తనకు చూపించారని ఆయన తెలిపారు. కేటీఆర్ చెప్పినట్టు లక్ష ఇండ్ల నిర్మాణం జరగలేదనీ, ఆ విషయం తెలియక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనతో చాలెంజ్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా రాష్ట్రాన్ని సాధించింది వ్యాపారాల కోసం కాదని ఆయన అన్నారు. ఫార్మా కంపెనీల కోసం వేల ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుందని ఆయన తెలిపారు. ఫార్మా కంపెనీల వెనక ఎవరు ఉన్నారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.