కరోనా చావులకు కేసీఆరే కారణం: భట్టి

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా చావులకు సీఎం కేసీఆరే కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం భట్టి మీడియాతో మాట్లాడుతూ పట్టణాల నుంచి పల్లెలకు కరోనా స్పీడ్‌గా వ్యాపిస్తోందని, నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం విఫలం అవుతోందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి వనరులన్ని వెచ్చించాలని, కరోనా వ్యాప్తికి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కూడా ఓ కారణమని, ముందుగా వాటిని కట్టడి చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది నియామకం జరగలేదని, […]

Update: 2020-07-21 07:04 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా చావులకు సీఎం కేసీఆరే కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం భట్టి మీడియాతో మాట్లాడుతూ పట్టణాల నుంచి పల్లెలకు కరోనా స్పీడ్‌గా వ్యాపిస్తోందని, నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం విఫలం అవుతోందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి వనరులన్ని వెచ్చించాలని, కరోనా వ్యాప్తికి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కూడా ఓ కారణమని, ముందుగా వాటిని కట్టడి చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది నియామకం జరగలేదని, రాష్ట్రవ్యాప్తంగా 700 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి అరకొర జీతాలు ఇస్తున్నారని, కరోనా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది వేతనాలు రెట్టింపు చేయాలన్నారు. నీటిపారుదల శాఖను సీఎం నిర్వీర్యం చేశారని, వారు చెప్పినట్లు సంతకాలు చేసే వారికే ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఆరేండ్లుగా ఈఎన్సీ లేడని, రిటైర్డ్ అయిన ఉద్యోగినే కొనసాగిస్తుండటం సిగ్గుచేటన్నారు.

Tags:    

Similar News