ఏడాది క్రితమే దళిత బంధు.. మరో మోసానికి తెరలేపిన కేసీఆర్: భట్టి

దిశ, తెలంగాణ బ్యూరో : మాయమాటలు చెప్పి దళిత, గిరిజనుల ఓట్లు దండుకునేందుకు దళిత బంధు పేరుతో మరో మోసానికి కేసీఆర్ తెరలేపాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. శుక్రవారం సీఎల్పీ కార్యాల‌యంలో మంథ‌ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, ప్రేమ్ సాగ‌ర్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న ద‌ళిత‌-గిరిజ‌న ఆత్మగౌర‌వ దండోరాకు రావాలని పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి స‌భ కోసం జ‌రుగుతున్న […]

Update: 2021-08-06 11:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మాయమాటలు చెప్పి దళిత, గిరిజనుల ఓట్లు దండుకునేందుకు దళిత బంధు పేరుతో మరో మోసానికి కేసీఆర్ తెరలేపాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. శుక్రవారం సీఎల్పీ కార్యాల‌యంలో మంథ‌ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, ప్రేమ్ సాగ‌ర్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న ద‌ళిత‌-గిరిజ‌న ఆత్మగౌర‌వ దండోరాకు రావాలని పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి స‌భ కోసం జ‌రుగుతున్న ఏర్పాట్లపై చ‌ర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికే దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నామని రాష్ట్రంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఉద్యమం ప్రారంభం అవుతుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలు ఉన్నందుకే కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. దళిత బంధుకు ఏడాది క్రితమే రూపకల్పన చేశామని ప్రకటనలో చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుడే ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. మోసపూరిత ప్రకటనలు, పథకాలు మానుకోవాలని కేసీఆర్‌కు సూచించారు.

Tags:    

Similar News