భారతీ ఆక్సా ఆదాయం రూ.3,157కోట్లు!

ముంబయి: ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ భారతీ ఆక్సా ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరానికి మార్చి త్రైమాసికంలో రూ.3,157కోట్ల వృద్ధి సాధించినట్టు వెల్లడించింది. అంతకుముందు ఏడాదిలో రూ.2,285కోట్ల కంటే 38శాతం వృద్ధి అని ప్రకటించింది. పంట బీమా ఆదాయం 59శాతం వృద్ధితో రూ.828కోట్లకు చేరిందని, ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈల వాణిజ్య బీమా ఆదాయం 49శాతం వృద్ధితో రూ.430కోట్లకు చేరిందని, వాహన బీమా ఆదాయం 30శాతం వృద్ధితో రూ.1488కోట్లకు చేరినట్టు కంపెనీ వెల్లడించింది. ఆరోగ్య బీమా విభాగంలో 23శాతం ఆదాయం […]

Update: 2020-06-16 06:18 GMT

ముంబయి: ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ భారతీ ఆక్సా ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరానికి మార్చి త్రైమాసికంలో రూ.3,157కోట్ల వృద్ధి సాధించినట్టు వెల్లడించింది. అంతకుముందు ఏడాదిలో రూ.2,285కోట్ల కంటే 38శాతం వృద్ధి అని ప్రకటించింది. పంట బీమా ఆదాయం 59శాతం వృద్ధితో రూ.828కోట్లకు చేరిందని, ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈల వాణిజ్య బీమా ఆదాయం 49శాతం వృద్ధితో రూ.430కోట్లకు చేరిందని, వాహన బీమా ఆదాయం 30శాతం వృద్ధితో రూ.1488కోట్లకు చేరినట్టు కంపెనీ వెల్లడించింది. ఆరోగ్య బీమా విభాగంలో 23శాతం ఆదాయం వృద్ధి చెంది రూ.410కోట్లు ఉన్నట్టు పేర్కొంది. అన్ని విభాగాల్లో స్థిరమైన రెండంకెల వృద్ధిని సాధించామని, తమ భిన్నమైన ఉత్పత్తులు, పంపిణీ, భాగస్వామ్యాలే ప్రీమియం ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని భారతీ ఆక్సా సీఈవో, ఎండీ సంజీవ్ తెలిపారు.

Tags:    

Similar News