యాక్టర్స్, టెక్నిషియన్స్‌కు భారతీరాజా రిక్వెస్ట్

దిశ, వెబ్‌డెస్క్ : డైరెక్టర్, కోలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భారతీ రాజా.. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటులు, టెక్నిషియన్స్‌కు ఓపెన్ లెటర్ రాస్తూ రిక్వెస్ట్ చేశారు. నిర్మాతలు తమ సినిమాలను రీస్టార్ట్ చేసేందుకు.. తమ రెమ్యునరేషన్స్‌లో 30 శాతం తగ్గించాలని కోరారు. లేదంటే లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన వారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సినిమాల నిర్మాతలు.. డిజిటల్, ఆడియో, శాటిలైట్ రైట్స్ అమ్మకాల ద్వారా […]

Update: 2020-10-19 07:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : డైరెక్టర్, కోలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భారతీ రాజా.. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటులు, టెక్నిషియన్స్‌కు ఓపెన్ లెటర్ రాస్తూ రిక్వెస్ట్ చేశారు. నిర్మాతలు తమ సినిమాలను రీస్టార్ట్ చేసేందుకు.. తమ రెమ్యునరేషన్స్‌లో 30 శాతం తగ్గించాలని కోరారు. లేదంటే లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన వారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని అన్నారు.

లాక్‌డౌన్ కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సినిమాల నిర్మాతలు.. డిజిటల్, ఆడియో, శాటిలైట్ రైట్స్ అమ్మకాల ద్వారా ఎలాంటి డబ్బు పొందలేక పోతున్నారుని.. వారి పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. సినిమా కోసం అప్పుగా తీసుకున్న అసలుపై వడ్డీ కూడా చెల్లించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News