100కోట్ల డోసుల తయారీ దిశగా ఒప్పందం..

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ (Bharath biotech) కీలక ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 (Covid-19) నివారణకు ‘నాసల్ స్ప్రే వ్యాక్సిన్’ని ( Nassal spray vaccine) తయారు చేయడానికి సిద్ధమైనట్టు, దీనికి సంబంధించి యూనివర్శిటీతో ఒప్పందం (Contract) చేసుకున్నట్టు బుధవారం వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్ బయోటెక్ సంస్థ యూఎస్ (US), జపాన్ (Japan), […]

Update: 2020-09-23 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ (Bharath biotech) కీలక ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 (Covid-19) నివారణకు ‘నాసల్ స్ప్రే వ్యాక్సిన్’ని ( Nassal spray vaccine) తయారు చేయడానికి సిద్ధమైనట్టు, దీనికి సంబంధించి యూనివర్శిటీతో ఒప్పందం (Contract) చేసుకున్నట్టు బుధవారం వెల్లడించింది.

ఈ ఒప్పందం ద్వారా భారత్ బయోటెక్ సంస్థ యూఎస్ (US), జపాన్ (Japan), యూరప్ మినహాయించి ప్రపంచ దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ని పంపిణీ చేసేందుకు అన్ని హక్కులను సొంతం చేసుకుంది. ఈ వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు సెయింట్ లూయిస్ యూనివర్శిటీ (Saint luies univercity)లో జరగనుండగా, అనంతర క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి అనుమతులు వచ్చిన తర్వాత భారత్‌లో నిర్వహించనుంది. తదుపరి భారీస్థాయిలో ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. వ్యాక్సిన్ తయారీతో పాటు, పంపిణీలో తమ సంస్థకున్న అనుభవం ప్రజలకు చేరువ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ వెల్లడించారు.

సంప్రదాయ ఇంజెక్షన్ కంటే నాసల్ స్ప్రే వ్యాక్సిన్లను అందించడం మరింత సులభమవుతుందని, సిరంజి, సూదుల సామగ్రిని ఈ వ్యాక్సిన్‌లు తగ్గిస్తాయని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్‌కి అయ్యే ఖర్చు కూడా తగ్గే అవకాశాలున్నాయని, వంద కోట్ల (100 crores) డోసుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డాక్టర్ కృష్ణ తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను సింగిల్ డోస్‌ (Single dose)లో ఇచ్చేలా రూపొందిస్తున్నట్టు, తద్వారా వ్యాక్సిన్‌ను వేగంగా, ఎక్కువమందికి అందించే అవకాశముంటుందని వాషింగ్టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News