సాదాసీదాగానే గణేష్ చతుర్థి
దిశ, వెబ్ డెస్క్: సాదాసీదాగానే గణేష్ చతుర్థి జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచించింది. సోమవారం ఈ ఉత్సవ సమితి మీడియాతో మాట్లాడింది. సామూహిక నిమజ్జనాన్ని విరమించుకుంటున్నట్లు పేర్కొన్నది. వినాయక మండపాలకు ఎవరి అనుమతి అవసరంలేదని, దేవుడిని పూజించేందుకు పర్మిషన్ అవసరంలేదని పేర్కొన్నది. ఎత్తులపై పోటీ పడకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలని, తక్కువ మందితో మాత్రమే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ముందుకు వెళ్లాలని, మండపాల వద్ద నలుగురికి […]
దిశ, వెబ్ డెస్క్: సాదాసీదాగానే గణేష్ చతుర్థి జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచించింది. సోమవారం ఈ ఉత్సవ సమితి మీడియాతో మాట్లాడింది. సామూహిక నిమజ్జనాన్ని విరమించుకుంటున్నట్లు పేర్కొన్నది. వినాయక మండపాలకు ఎవరి అనుమతి అవసరంలేదని, దేవుడిని పూజించేందుకు పర్మిషన్ అవసరంలేదని పేర్కొన్నది. ఎత్తులపై పోటీ పడకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలని, తక్కువ మందితో మాత్రమే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ముందుకు వెళ్లాలని, మండపాల వద్ద నలుగురికి మించి ఎక్కువమంది ఉండొద్దని పేర్కొన్నది.