స్టాండప్ కమెడియన్‌గా స్వర భాస్కర్

దిశ, వెబ్‌డెస్క్: మంచి కంటెంట్‌తో ఏ భాషలో సినిమా వచ్చినా సరే, ఫిల్మ్ మేకర్స్ వెంటనే ఆ సినిమాను మరో భాషలో తెరకెక్కించేందుకు సిద్ధపడతారు. ఇప్పటివరకు సినిమాలకు మాత్రమే ‘రీమేక్’లు పరిమితమవ్వగా, ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్‌లు కూడా ‘రీమేక్’ స్థాయికి వచ్చేశాయి. టీవీఎఫ్‌లో వచ్చిన ‘పర్మినెంట్ రూమ్‌మేట్స్’ వెబ్‌సిరీస్‌ను తెలుగులో ‘కమిట్‌మెంటల్’గా ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే క్రమంలో అమెజాన్ వెబ్ సిరీస్ ‘ద మార్వలస్ మిసెస్ మైసెల్’ను నెట్‌ఫ్లిక్స్ ‘భాగ్ బీని […]

Update: 2020-11-20 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంచి కంటెంట్‌తో ఏ భాషలో సినిమా వచ్చినా సరే, ఫిల్మ్ మేకర్స్ వెంటనే ఆ సినిమాను మరో భాషలో తెరకెక్కించేందుకు సిద్ధపడతారు. ఇప్పటివరకు సినిమాలకు మాత్రమే ‘రీమేక్’లు పరిమితమవ్వగా, ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్‌లు కూడా ‘రీమేక్’ స్థాయికి వచ్చేశాయి. టీవీఎఫ్‌లో వచ్చిన ‘పర్మినెంట్ రూమ్‌మేట్స్’ వెబ్‌సిరీస్‌ను తెలుగులో ‘కమిట్‌మెంటల్’గా ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే క్రమంలో అమెజాన్ వెబ్ సిరీస్ ‘ద మార్వలస్ మిసెస్ మైసెల్’ను నెట్‌ఫ్లిక్స్ ‘భాగ్ బీని భాగ్’గా రూపొందించింది. స్వర భాస్కర్ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వస్తున్న న్యూ సిరీస్ ‘భాగ్ బీని భాగ్’లో స్వర భాస్కర్ స్టాండప్ కమెడియన్‌ రోల్ (బీని క్యారెక్టర్‌) పోషిస్తోంది. తన కెరీర్‌ను నిర్మించుకునే పనిలో ఉండే బీని.. రొటీన్ లైఫ్ నుంచి ఎప్పుడూ పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతూ పారిపోతూ.. చివరకు తనలోని టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసి, ‘స్టాండప్ కమెడియన్’‌గా రాణిస్తుంది. ట్రైలర్‌లో ఇదే విషయాన్ని చూపించగా.. భాగ్ బీని భాగ్‌లో యూట్యూబర్ డాలీ సింగ్, అమెరికన్ యాక్టర్ రవి పటేల్, స్టాండప్ కమెడియన్ వరుణ్ ఠాకూర్‌లు నటించారు. ఇక ‘బీని’ రోల్ పోషించిన స్వర భాస్కర్‌కు వెబ్ వరల్డ్‌లో ఇది నాలుగో సిరీస్. గతంలో ఆమె ‘ఇట్స్ నాట్ దట్ సింపుల్, రాస్‌భరి, ఫ్లెష్‌’లో నటించింది. ఇక భాగ్ బీని భాగ్ డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే సూపర్ సక్సెస్ సాధించిన అమెజాన్ వెబ్ సిరీస్ ‘ద మార్వలస్ మిసెస్ మైసెల్’ ఎమ్మి అవార్డు కూడా గెలుచుకుంది. మరి ‘భాగ్ బీని భాగ్’ ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News