రూ.50 వేల పానీపూరి ఫ్రీగా పంచిన స్ట్రీట్ వెండర్

దిశ, ఫీచర్స్ : జీవితంలో సంతోషకర సంఘటనలు జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. ఒకవేళ ఆర్థిక స్థోమత సహకరించకపోయినా ఉన్నంతలోనే ఏదోవిధంగా నలుగురితో ఆనందాన్ని పంచుకుంటాం. అయితే సాధారణంగా కొడుకు పుట్టినపుడు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్.. కూతురి విషయంలో వెనకడుగు వేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన స్ట్రీట్ వెండర్ ఒకరు తనకు బిడ్డ పుట్టిందన్న సంతోషంలో రూ.50 వేల విలువైన పానీపూరిని నగరవాసులకు ఫ్రీగా సర్వ్ చేశాడు. తన సెలబ్రేషన్స్‌తో కూతురిని ఈ […]

Update: 2021-09-14 04:47 GMT

దిశ, ఫీచర్స్ : జీవితంలో సంతోషకర సంఘటనలు జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. ఒకవేళ ఆర్థిక స్థోమత సహకరించకపోయినా ఉన్నంతలోనే ఏదోవిధంగా నలుగురితో ఆనందాన్ని పంచుకుంటాం. అయితే సాధారణంగా కొడుకు పుట్టినపుడు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్.. కూతురి విషయంలో వెనకడుగు వేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన స్ట్రీట్ వెండర్ ఒకరు తనకు బిడ్డ పుట్టిందన్న సంతోషంలో రూ.50 వేల విలువైన పానీపూరిని నగరవాసులకు ఫ్రీగా సర్వ్ చేశాడు.

తన సెలబ్రేషన్స్‌తో కూతురిని ఈ లోకంలోకి ఆహ్వానించిన 30 ఏళ్ల అంచల్ గుప్తా.. జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదనే సందేశాన్ని ఇచ్చాడు. భోపాల్‌లోని కోలార్ ఏరియాలో చాట్ స్టాల్ నడుపుతున్న గుప్తా.. ‘కుమార్తెలతోనే భవిష్యత్’ అంటూ వివరించాడు. కాగా తన హృదయపూర్వక చర్యను చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ కూడా అభినందించారు. గుప్తా కూతురి ఉజ్వల భవిష్యత్తుకు తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చాడు.

50 వేల విలువైన పాని పూరి

8వ తరగతి మాత్రమే చదివిన స్ట్రీట్ వెండర్ గుప్తాకు ఆగస్టు 17న కూతురు పుట్టింది. అదే రోజు తన కొడుకు సెకండ్ బర్త్‌డే కావడంతో.. నగరవాసులకు ఉచితంగా పానీపూరి అందించాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఫ్రీ ఆఫర్ విషయం తెలుసుకున్న స్థానికులు తన స్టాల్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో వారందరినీ మేనేజ్ చేసేందుకు 10 స్టాల్స్ ఏర్పాటుచేసిన గుప్తా.. 5 గంటల పాటు సర్వ్ చేశాడు. పైగా తనకు కూతురు పుట్టిన సంతోషం ముందు రూ.50000 ఖర్చు పెద్ద విషయం కాదని లైట్ తీసుకున్నాడు. అయితే ఇదే క్రమంలో జనాలు కొవిడ్-19 ప్రోటోకాల్స్ మరిచిపోవడం గమనార్హం.

Tags:    

Similar News