గీతం అధ్యాపకుడికి అత్యుత్తమ టీచర్ అవార్డు..!

దిశ, పటాన్‎చెరు: హైదరాబాద్‎లోని గీతం యూనివర్సిటీ ఈఈసీఈ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.మంజునాథాచారి అత్యుత్తమ టీచర్ అవార్డు పొందారు. విద్య పరిశోధన రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు (సెప్టెంబర్ 5)న ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నాలేడ్జ్ సొసైటీ ఫర్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ పేర్కొంది. గీతం యూనివర్సిటీలో ఎస్.ఆశావర్మ అధ్యక్షతన జరిగిన గోటూ మీటింగ్‎లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎంవీఎన్ శర్మ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ఈసీఈ విభాగం ప్రొఫెసర్ […]

Update: 2020-09-10 08:15 GMT

దిశ, పటాన్‎చెరు: హైదరాబాద్‎లోని గీతం యూనివర్సిటీ ఈఈసీఈ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.మంజునాథాచారి అత్యుత్తమ టీచర్ అవార్డు పొందారు. విద్య పరిశోధన రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు (సెప్టెంబర్ 5)న ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నాలేడ్జ్ సొసైటీ ఫర్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ పేర్కొంది.

గీతం యూనివర్సిటీలో ఎస్.ఆశావర్మ అధ్యక్షతన జరిగిన గోటూ మీటింగ్‎లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎంవీఎన్ శర్మ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ఈసీఈ విభాగం ప్రొఫెసర్ ఓబీవీ రామయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై మంజునాథాచారికి అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. కె.మంజునాథాచారిని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివకుమార్, ప్రొఫెసర్లు, తదితరులు అభినందించారు.

Tags:    

Similar News