అంతరిక్ష శకలాలపై త్రినేత్రం

దిశ, ఫీచర్స్ : అంతరిక్షంలో అనేక కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వీటిని రకరకాల ప్రయోజనాల కోసం మనం వినియోగించుకుంటున్నాం. ఈ క్రమంలోనే 64ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ ప్రపంచ తొలి ఉపగ్రహాం ‘స్పుత్నిక్‌’‌ను రోదసిలోకి పంపింది. ఇక అప్పటినుంచి పలు దేశాలు మొత్తం 8 వేలకు పైగా కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించగా.. ప్రస్తుతం 2వేల ఉపగ్రహాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలో అమెరికా శాటిలైట్స్ అధికంగా ఉన్నాయి. అయితే స్పేస్‌లో ఉపగ్రహాలు పెరిగిపోవడం, అందులో కొన్ని చెడిపోయిన […]

Update: 2021-07-28 21:05 GMT

దిశ, ఫీచర్స్ : అంతరిక్షంలో అనేక కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వీటిని రకరకాల ప్రయోజనాల కోసం మనం వినియోగించుకుంటున్నాం. ఈ క్రమంలోనే 64ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ ప్రపంచ తొలి ఉపగ్రహాం ‘స్పుత్నిక్‌’‌ను రోదసిలోకి పంపింది. ఇక అప్పటినుంచి పలు దేశాలు మొత్తం 8 వేలకు పైగా కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించగా.. ప్రస్తుతం 2వేల ఉపగ్రహాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలో అమెరికా శాటిలైట్స్ అధికంగా ఉన్నాయి. అయితే స్పేస్‌లో ఉపగ్రహాలు పెరిగిపోవడం, అందులో కొన్ని చెడిపోయిన ఉపగ్రహాల స్పేర్ పార్ట్స్‌ వల్ల రోదసిలోని ఇతర శాటిలైట్స్‌కు ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అంతరిక్షంలో ప్రమాదకరంగా తిరిగే శిథిలాలను గుర్తించడానికి బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘దిగంతర’ అనే ప్రత్యేక పరికరాన్ని రూపొందిస్తోంది.

అంతరిక్ష శకలాలు స్పేస్‌క్రాఫ్ట్స్‌కు అతిపెద్ద ముప్పు అని యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఇటీవలే తెలిపింది. తాజా డేటా ప్రకారం అంతరిక్షంలో సుమారు 3వేలకు పైగా ఉపగ్రహాలు పనిచేయట్లేదని, దాంతో బ్రేక్-అప్స్, పేలుళ్లు, ఒకదాన్నొకటి ఢీకొట్టడం వల్ల శిథిలాలు ఏర్పడుతాయని వెల్లడించింది. ఇక రోదసిలో10 సెం.మీ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న శకలాలు 34వేలు ఉండగా.. ఇవి 1 సెం.మీ-10 సెం.మీ మధ్య 9లక్షలు, 1 మి.మీ- 1 సెం.మీ మధ్య 128 మిలియన్ల కక్ష్యలో ఉన్నట్లు అంచనా. ఈ బిట్స్ గంటకు దాదాపు 29వేల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో తిరుగుతుండటంతో అవి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అందువల్లే పరిశోధకులు నిత్యం రాడార్ల ద్వారా వీటిని ట్రాక్ చేస్తుంటారు. భూ-ఆధారిత వ్యవస్థలు అటువంటి శిథిలాలను గుర్తించి పర్యవేక్షించడానికి ప్రయత్నించినప్పటికీ అవి 10 సెం.మీ కంటే పెద్ద పరిమాణంలో ఉన్న వస్తువులను మాత్రమే ట్రాక్ చేయగలవు.

దిగంతర స్టార్టప్‌ను అనిరుధ్‌‌, రాహుల్ రావత్, తన్వీర్‌ అనే ముగ్గురు యువకులు ప్రారంభించారు. అలాగే అంతరిక్ష శిథిలాలను మానిటర్ చేయడానికి అదే పేరుతో ఓ ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. అయితే భారత అంతరిక్షంలో శిథిలాలను ‘మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్’ ద్వారా ట్రాక్ చేస్తూ.. భూమ్మీద నుంచే వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రపంచంలో కొన్ని సంస్థలు స్పేస్ డెబ్రిస్‌ను ట్రాక్ చేయడానికి స్పేస్‌లోనే ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తున్నాయి. అలాంటి ‘స్పేస్ డెబ్రిస్ మానిటర్’‌గా ‘దిగంతర’ను నానో ఉపగ్రహంతో జతచేసి రోదసిలోకి వీళ్లు పంపిస్తున్నారు. ఇది పరికరంలోని లేజర్ మాడ్యూల్ 1 సెం.మీ – 20 సెం.మీ.ల మధ్య వస్తువులను ట్రాక్ చేసి, ఆ డేటాను షేర్ చేస్తుంది. అంతేకాదు ఆ శిథిల వస్తువు భవిష్యత్తును అంచనా వేస్తుంది. ప్రస్తుతం దిగంతర బృందం Q4FY21 డెమో మిషన్‌లో పనిచేస్తోంది. ఇందులో భాగంగా వాళ్లు ఓ నానో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి 10సెంటిమీటర్ల పరిమాణంలోని శిథిలాలను మానిటర్ చేసి సమాచారాన్ని సేకరిస్తారు. అయితే వాళ్లు ట్రాక్ చేసిన శిథిలాలను ఇదివరకే భూమి-ఆధారిత వ్యవస్థల ద్వారా పర్యవేక్షిస్తుండగా ‘దిగంతర’ వాటిని సరిగ్గా గుర్తించగలిగితేనే మిషన్ సక్సెస్ సాధిస్తుంది.

అనిరుధ్ శర్మ అనే యువకుడికి ఏరోస్పేస్, ఏరోనాటిక్స్ పట్ల ఆసక్తి ఎక్కువ. బీటెక్ చదువుతున్న సమయంలోనే ఏరోస్పేస్‌పై ఇంట్రెస్ట్ ఉన్న తన్వీర్ అహ్మద్ (22)తో కలిసి నానో ఉపగ్రహాన్ని నిర్మించడంతో పాటు అంతరిక్ష సంబంధ విషయాలపై పని చేయడానికి ఒక చిన్న విద్యార్థి క్లబ్‌ను ఏర్పాటు చేశారు. చండీగర్‌లో ఇస్రో నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో అనిరుధ్ టీమ్‌ అవార్డ్ గెలుచుకోవడంతో వారికి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే లాటిన్ అమెరికన్ అంతరిక్ష సంస్థ ఓ ఉపగ్రహ భాగాన్ని రూపొందించమని వారిని కోరింది. ఆ ప్రాజెక్ట్ కారణంగానే వారు ‘దిగంతర’ స్టార్టప్ లాంచ్ చేసి, మరెన్నో ప్రాజెక్ట్‌లు విజయవంతంగా పూర్తి చేశారు. దేశ, విదేశాల్లోని అంతరిక్ష సమావేశాల్లో దిగంతర టీమ్ పార్టిసిపేట్ చేసింది. ఈ క్రమంలోనే జర్మనీలో జరిగిన‘స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ (ఎస్‌ఎస్‌ఏ)’‌లోనూ పాల్గొన్నారు. సహజ, కృత్రిమ వస్తువులను అంతరిక్షం నుండే పర్యవేక్షించడంతో పాటు, ఏయే సమయాల్లో ఆ వస్తువులు ఎలా పరిభ్రమిస్తాయో ఊహించడం, భవిష్యత్తు మార్గాన్ని అంచనా వేయడం వంటి అంశాలు చర్చించారు. అయితే స్పేస్ డెబ్రిస్ సమస్యను పెనుముప్పుగా భావించిన కుర్రాళ్లు అందుకు పరిష్కారంగా శిథిలాలను ట్రాక్ చేసే ‘దిగంతర’ను అభివృద్ధి చేశారు.

ఇటలీకి చెందిన ప్రముఖ స్పేస్ ఫ్లైట్ సర్వీసెస్ ‘టెలిస్పాజియో’తో మేం జట్టుకట్టాం. మా ప్రొడక్ట్ ప్రారంభించడానికే ముందే అంతర్జాతీయ కంపెనీ సహాకారం అందించడం సంతోషంగా ఉంది. దిగంతర డేటాను ప్రభుత్వాలు, రక్షణ సంస్థలతో పాటు వాణిజ్య అంతరిక్ష సంస్థలకు విక్రయించాలని భావిస్తున్నాం. అటువంటి డేటాను అందించడం ద్వారా మిషన్ ఆపరేషన్ ఖర్చులను 70 శాతం తగ్గించడానికి మేము వారికి సహాయపడతాం.
– అనిరుధ్ శర్మ

Tags:    

Similar News