భారత మాజీ ప్రధానికి బెంగళూరు కోర్టు షాక్.. రూ.2 కోట్లు జరిమానా
దిశ, వెబ్‌డెస్క్ : భారత మాజీ ప్రధానికి బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పరువు నష్టం కేసులో ప్రత్యర్థికి రూ.2కోట్లు చెల్లించాలని మాజీ ప్రధాని దేవగౌడను కోర్టు ఆదేశించింది.2012లో నంది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ పై దేవగౌడ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ నంది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యాజమాన్యం కోర్టులో పరువునష్టం దావా వేసింది. నాటి నుంచి విచారణ జరుగుతూ వస్తున్న కేసులో ఎట్టకేలకు […]
దిశ, వెబ్‌డెస్క్ : భారత మాజీ ప్రధానికి బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పరువు నష్టం కేసులో ప్రత్యర్థికి రూ.2కోట్లు చెల్లించాలని మాజీ ప్రధాని దేవగౌడను కోర్టు ఆదేశించింది.2012లో నంది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ పై దేవగౌడ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ నంది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యాజమాన్యం కోర్టులో పరువునష్టం దావా వేసింది.
నాటి నుంచి విచారణ జరుగుతూ వస్తున్న కేసులో ఎట్టకేలకు తొమ్మిదేండ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. నంది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వారికి కలిగిన డామేజ్‌ను పూరించేందుకు రూ.2 కోట్లు చెల్లించాలని మాజీ ప్రధానిని బెంగళూరు కోర్టు ఆదేశించడంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదిలాఉండగా, భారతదేశ 11వ ప్రధాన మంత్రిగా దేవగౌడ 1 జూన్ 1996 నుంచి 21 ఏప్రిల్ 1997వరకు పదవిలో కొనసాగారు.