విమాన రాకపోకలపై బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ రద్దు నిర్ణయాన్ని ఆగస్టు 15 వరకు మరోసారి పొడిగించింది. దీంతో ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌పూర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కలకత్తాకు విమానాల రాకపోకలు మరోసారి బంద్ అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Update: 2020-07-30 11:31 GMT

Tags:    

Similar News