బెంగాల్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ప్రస్తుతం శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తన హెచ్చరికలను పట్టించుకోవడం లేదని గవర్నర్ ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెంగాల్ పర్యటన సందర్భంగా టీఎంసీ నేతలు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. मेरे बहादुर मित्र मा @KailashOnline जी आपके घायल […]

Update: 2020-12-11 01:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ప్రస్తుతం శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తన హెచ్చరికలను పట్టించుకోవడం లేదని గవర్నర్ ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెంగాల్ పర్యటన సందర్భంగా టీఎంసీ నేతలు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

ఈ దాడిలో ఆయన కాన్వాయ్ అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. కాగా, నడ్డాపై హత్యాయత్నం జరగడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.గవర్నర్ ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కేంద్రం సమన్లు జారీ చేసింది.

Tags:    

Similar News