ఫెలుదా గుడ్ బై : మమతా బెనర్జీ
దిశ, వెబ్‌డెస్క్: బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీకి అక్టోబర్ 6న కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, కోల్‌కతాలోని బెల్లెవ్ నర్సింగ్ హోమ్‌కు తరలించి చికిత్సనందించారు. 40 రోజుల పాటుగా ఆయన హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఇవాళ ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సౌమిత్ర ఛటర్జీ మృతిపై సినీరాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఛటర్జీ మృతిపట్ల పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తన సానుభూతి తెలియజేశారు. ‘ఫెలూదా ఇకలేరు. ‘అపు’ గుడ్ బై చెప్పారు. సౌమిత్ర ఛటర్జీకి […]
దిశ, వెబ్‌డెస్క్: బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీకి అక్టోబర్ 6న కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, కోల్‌కతాలోని బెల్లెవ్ నర్సింగ్ హోమ్‌కు తరలించి చికిత్సనందించారు. 40 రోజుల పాటుగా ఆయన హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఇవాళ ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సౌమిత్ర ఛటర్జీ మృతిపై సినీరాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఛటర్జీ మృతిపట్ల పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తన సానుభూతి తెలియజేశారు.
‘ఫెలూదా ఇకలేరు. ‘అపు’ గుడ్ బై చెప్పారు. సౌమిత్ర ఛటర్జీకి కన్నీటి వీడ్కోలు. ఆయనో లెజెండ్. బెంగాలీ, జాతీయ, అంతర్జాతీయ సినీ పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన లేని లోటుతో బెంగాలీ సినీపరిశ్రమ అనాథగా మారింది. మేము అతడిని మిస్ అవుతున్నాం’ అంటూ సీఎం మమతా బెనర్జీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.