బీజేపీని బొందపెట్టండి.. దీదీ ఫైర్

కోల్‌కతా: బెంగాల్ నుంచి బీజేపీని తరిమికొట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను కోరారు. దేశాన్ని ఆకర్షిస్తున్న నందిగ్రామ్ సీటు నుంచి ఎన్నికల బరిలో ఉన్న ఆమె.. మంగళవారం అక్కడ నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీని పాతరేయండని, నందిగ్రామ్ నుంచే గాక బెంగాల్ నుంచి కూడా ఆ పార్టీని తరిమికొట్టాలని ప్రజలను కోరారు. ఎన్నికలలో ప్రశాంతంగా ఓటువేయాలని ఓటర్లను కోరారు. ‘కూల్ కూల్ తృణమూల్, ఠండా ఠండా కూల్ కూల్. […]

Update: 2021-03-30 04:54 GMT

కోల్‌కతా: బెంగాల్ నుంచి బీజేపీని తరిమికొట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను కోరారు. దేశాన్ని ఆకర్షిస్తున్న నందిగ్రామ్ సీటు నుంచి ఎన్నికల బరిలో ఉన్న ఆమె.. మంగళవారం అక్కడ నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీని పాతరేయండని, నందిగ్రామ్ నుంచే గాక బెంగాల్ నుంచి కూడా ఆ పార్టీని తరిమికొట్టాలని ప్రజలను కోరారు. ఎన్నికలలో ప్రశాంతంగా ఓటువేయాలని ఓటర్లను కోరారు. ‘కూల్ కూల్ తృణమూల్, ఠండా ఠండా కూల్ కూల్. ఓట్ పాబే జోడా ఫూల్’ అంటూ నినదించారు.

నందిగ్రామ్‌లో నేటితో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక సువేందు అధికారికి మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు. సువేందు గెలుపు ఖాయమని, బెంగాల్‌లో 200కు పైగా సీట్లను బీజేపీ గెలవబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో మార్పు రాబోతుందని అన్నారు. అమిత్ షా రోడ్డుకు కొద్ది దూరం నుంచే మమతా రోడ్డు షో కూడా వెళ్లడంతో బీజేపీ కార్యకర్తలు జైశ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. ఆమె ర్యాలీకి అడ్డుపడటానికి యత్నించారు.

Tags:    

Similar News