పింఛనుదారుల సామాజిక దూరం
దిశ, మెదక్: మెదక్ జిల్లా రేగోడు మండలం ప్యారారం గ్రామంలో సోమవారం ఉదయం ఆసరా పింఛన్‌లను పంపిణీ చేశారు. డబ్బులు తీసుకోవడానికి వచ్చిన లబ్దిదారులు సామాజిక దూరం పాటించారు. డబ్బులు తీసుకునే ముందు శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కున్నారు. గ్రామపంచాయతీ సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నామని లింగంపల్లి బ్రాంచ్ పోస్టుమాస్టర్ సంజీవయ్య తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. Tags : Beneficiaries, social distance, […]
దిశ, మెదక్: మెదక్ జిల్లా రేగోడు మండలం ప్యారారం గ్రామంలో సోమవారం ఉదయం ఆసరా పింఛన్‌లను పంపిణీ చేశారు. డబ్బులు తీసుకోవడానికి వచ్చిన లబ్దిదారులు సామాజిక దూరం పాటించారు. డబ్బులు తీసుకునే ముందు శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కున్నారు. గ్రామపంచాయతీ సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నామని లింగంపల్లి బ్రాంచ్ పోస్టుమాస్టర్ సంజీవయ్య తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.
Tags : Beneficiaries, social distance, pension center, medak, Postal Department