‘డబుల్’ పంపిణీలో అలసత్వం.. తాళాలు పగలగొట్టిన లబ్దిదారులు..
దిశ, దేవరుప్పుల: రాష్ట్రప్రభుత్వం దేవరుప్పుల గ్రామానికి యాభై రెండు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం గడిచింది. అయితే సంవత్సరం క్రితం 52 ఇండ్లలో 46 ఇండ్లను లబ్ధిదారులకు గ్రామ పంచాయితీ కార్యాలయంలో డ్రా పద్ధతిన కేటాయించారు. కానీ 06 ఇండ్లను అధికారులు గ్రామ పంచాయతీ పాలకవర్గం పెండింగ్ లో పెట్టారు. సంవత్సర కాలంగా ఆ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో శనివారం ఉదయం లబ్ధిదారులు అంబటి యాకమ్మ కొమురయ్య, […]
దిశ, దేవరుప్పుల: రాష్ట్రప్రభుత్వం దేవరుప్పుల గ్రామానికి యాభై రెండు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం గడిచింది. అయితే సంవత్సరం క్రితం 52 ఇండ్లలో 46 ఇండ్లను లబ్ధిదారులకు గ్రామ పంచాయితీ కార్యాలయంలో డ్రా పద్ధతిన కేటాయించారు. కానీ 06 ఇండ్లను అధికారులు గ్రామ పంచాయతీ పాలకవర్గం పెండింగ్ లో పెట్టారు. సంవత్సర కాలంగా ఆ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో శనివారం ఉదయం లబ్ధిదారులు అంబటి యాకమ్మ కొమురయ్య, రెడ్డిరాజుల లక్ష్మి కొండయ్య, నడిచే కవిత శ్రీను, నారబోయిన సోమ్మల్లమ్మ, ముద్దుల మౌనిక రమేష్, ఆకుల ఉదయశ్రీ శ్రీను, లు తాళాలు పగలగొట్టి అందులో చేరారు.
అయితే తమకు గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, డబుల్ బెడ్రూం ఇండ్లకు తాము అర్హులమని తెలిపారు. ఇండ్ల పంపకంలో జాప్యం జరగడంతో ఉండడానికి ఇల్లు లేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లోకి చేరామని తెలిపారు. అర్హులైన లబ్దిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. అయితే తాళాలు పగలగొట్టి అందులోకి వెళ్లడం సరైనది కాదని, ఈ విషయాన్ని సంబంధిత హౌసింగ్ ఏఈ డీఈ లకు తెలియజేశామన్నారు. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇండ్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.