మేడారం జాతరలో చిత్రాల కనికట్టు

          తెలంగాణ ప్రభుత్వం జాతీయ హోదా కావాలని డిమాండ్ చేస్తున్న మేడారం జాతర అంటేనే ఆదివాసీ పండగ. కోయ గిరిజనులు తమ కుల దైవాలుగా సమ్మక్క-సారలమ్మలను కొలుస్తారు. కకతీయుల పాలనా కాలంలో అప్పటి ఆదివాసీ రాజ్యమైన ఈ ప్రాంతాన్ని కరవు కాటకాలు పట్టి పీడించాయి. అన్న పానియాలు లేక ప్రజలు అలమటించారు. అయినప్పటికీ కప్పం కట్టాల్సిందేనని రాజాజ్జ.. దీంతో సమ్మక్క-సారలమ్మలు ఎదురు తిరిగారు.. తినేందుకే తిండి లేకపోతే కప్పం కట్టేదెలా? అంటూ […]

Update: 2020-02-02 02:48 GMT

తెలంగాణ ప్రభుత్వం జాతీయ హోదా కావాలని డిమాండ్ చేస్తున్న మేడారం జాతర అంటేనే ఆదివాసీ పండగ. కోయ గిరిజనులు తమ కుల దైవాలుగా సమ్మక్క-సారలమ్మలను కొలుస్తారు. కకతీయుల పాలనా కాలంలో అప్పటి ఆదివాసీ రాజ్యమైన ఈ ప్రాంతాన్ని కరవు కాటకాలు పట్టి పీడించాయి. అన్న పానియాలు లేక ప్రజలు అలమటించారు. అయినప్పటికీ కప్పం కట్టాల్సిందేనని రాజాజ్జ.. దీంతో సమ్మక్క-సారలమ్మలు ఎదురు తిరిగారు.. తినేందుకే తిండి లేకపోతే కప్పం కట్టేదెలా? అంటూ రాజును ప్రశ్నించారు. కాకతీయరాజులను ఎదిరించి వీరమరణం పొందారు.

ఆనాటి స్పూర్తిమంతమైన చారిత్రక ఘట్టాలను పొందు పరుస్తూ మేడారంలో చిత్రించిన బొమ్మలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారంలోని ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభుత్వం చిత్రాలు గీయించింది. ఈ జాతర వెయ్యేండ్లుగా జరుగుతున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వీటి సాయంతో గీసిన చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. గిరిజనుల మహాఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఇవి ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

జాతరకు సంబంధించిన చారిత్రక ఘట్టాలను నవతరానికి చాటిచెప్పేలా వీటిని చిత్రీకరించడంతో వీటిని వీక్షించేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఆదివాసీ సంప్రదాయంలో జాతర ఎలా ప్రారంభమౌతుంది, ఈ జాతరకు స్థానిక ప్రజలు ఎలా సమాయత్తమవుతారు అన్న విషయాలను ఈ చిత్రాలు కళ్లకు కడతాయి. కేవలం జాతరకు మాత్రమే పరిమితం కాకుండా అడవిబిడ్డల బతుకుచిత్రాన్ని తెలిపేలా మరిన్ని చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు వీటి ముందు నిలబడి సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

Tags:    

Similar News