కోహ్లీ, రోహిత్ మధ్య వీడియో కాన్ఫరెన్స్

దిశ, స్పోర్ట్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా మీడియాలో వీరిద్దరి ధోరణిపై పలు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. శనివారం కోహ్లీ, రోహిత్ మధ్య వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషీ సమక్షంలో వారిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో […]

Update: 2020-11-29 08:29 GMT

దిశ, స్పోర్ట్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. గతకొన్ని రోజులుగా మీడియాలో వీరిద్దరి ధోరణిపై పలు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. శనివారం కోహ్లీ, రోహిత్ మధ్య వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషీ సమక్షంలో వారిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయని.. తనకు సరైన సమాచారం లేకపోవడం వల్లే మీడియాలో అలా మాట్లాడినట్లు కోహ్లీ చెప్పినట్లు ముంబై మిర్రర్ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. రోహిత్ ఫిట్‌నెస్‌పై కూడా కోహ్లీ ఆరా తీశాడని.. కోచ్ రవిశాస్త్రి కూడా ఎప్పటిలోగా కోలుకుంటాడని అడిగినట్లు సమాచారం. డిసెంబర్ 11న రోహిత్‌కు నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్ష అనంతరం అతడి ఆస్ట్రేలియా పర్యటనపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.

Tags:    

Similar News