ఉడకని మాంసం వల్లే బర్డ్ ఫ్లూ... ICMR బిగ్ అలర్ట్

ఏపీలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందినట్లు ICMR నిర్ధారించింది. ..

Update: 2025-04-02 13:58 GMT
ఉడకని మాంసం వల్లే బర్డ్ ఫ్లూ... ICMR బిగ్ అలర్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో బర్డ్ ఫ్లూ(Bird Flu)తో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందినట్లు ICMR నిర్ధారించింది. నరసనరావుపేట(Narasana Raopet)లో బర్డ్ ఫ్లూతో బాలిక మృతి( Girl Died)పై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. పుణె ల్యాబ్ H5N1 వైరస్ సోకి బాలిక మృతి చెందినట్లు స్పష్టం చేసింది. బాలిక చనిపోయిన ప్రదేశంలో సర్వే చేసినట్లు తెలిపింది. ఉడకని మాంసం తినడంతోనే బర్డ్ ప్లూ సోకిందని స్పష్టం చేసింది. ఐదేళ్లలో దేశంలో నాలుగు H5N1, H9N2 కేసులు నమోదు అయినట్లు ఐసీఎమ్‌ఆర్ వెల్లడించింది.

కాగా మార్చి 16న పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopet)లో రెండేళ్ల బాలిక మృతి చెందింది. అయితే బర్డ్ ప్లూతో చనిపోయినట్లు వైద్య పరీక్షలు చేసి శ్యాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపారు. ఈ రిపోర్టుల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో చిన్నారి చనిపోయిందని అటు ఐసీఎమ్ఆర్ కూడా నిర్ధారించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఉడకని కోడి మాంసం తినడం, రోగ నిరోదక శక్తి తక్కువగా ఉండటం వల్ల చిన్నారి చనిపోయిందని తెలిపింది. ప్రధానంగా పచ్చి మాంసం తినొద్దని, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. 

Tags:    

Similar News