టీమిండియాలో ఆ ఇద్దరికి ఖేల్‌రత్న అవార్డ్..!

దిశ, వెబ్‌డెస్క్: క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్‌రత్న అవార్డులకు పలువురు క్రీడాకారుల పేర్లను బీసీసీఐ ప్రతిపాదించింది. భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలి రాజ్‌లను ఖేల్‌రత్న అవార్డ్‌కు సిఫారసు చేసింది. ప్రతియేటా ఖేల్‌రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు. ఇందులో భాగంగా బీసీసీఐ ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. ఇకపోతే అర్జున అవార్డ్ విషయానికి వస్తే క్రికెటర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, […]

Update: 2021-06-30 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్‌రత్న అవార్డులకు పలువురు క్రీడాకారుల పేర్లను బీసీసీఐ ప్రతిపాదించింది. భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలి రాజ్‌లను ఖేల్‌రత్న అవార్డ్‌కు సిఫారసు చేసింది. ప్రతియేటా ఖేల్‌రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు. ఇందులో భాగంగా బీసీసీఐ ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. ఇకపోతే అర్జున అవార్డ్ విషయానికి వస్తే క్రికెటర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, బుమ్రాల పేర్లను బీసీసీఐ ప్రతిపాదించింది.

Tags:    

Similar News