గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం
దిశ, స్పోర్ట్స్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబానికి కూడా సోకింది. గంగూలీ అన్నయ్య, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కార్యదర్శి స్నేహాశిష్ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన భార్య కూడా కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. కాగా, గత వారమే స్నేహాశిష్ అత్తమామలు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌరవ్ గంగూలీ బెహాలాలోని తమ పూర్వీకుల […]
దిశ, స్పోర్ట్స్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబానికి కూడా సోకింది. గంగూలీ అన్నయ్య, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కార్యదర్శి స్నేహాశిష్ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన భార్య కూడా కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. కాగా, గత వారమే స్నేహాశిష్ అత్తమామలు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌరవ్ గంగూలీ బెహాలాలోని తమ పూర్వీకుల ఇంట్లో ఉంటుండగా, అతడి సోదరుడి కుటుంబం మాత్రం విడిగా వేరే ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం వారికి మరోసారి టెస్టులు నిర్వహించి ఆస్పత్రిలోనే ఉంచాలా లేదా హోం ఐసోలేషన్‌కు పంపాలా అనేది నిర్ణయిస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.