శ్రీలంక బోర్డు ప్రతిపాదనపై స్పందించిన బీసీసీఐ
కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తాము ఆతిథ్యం ఇస్తామన్న శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదనపై తాజాగా బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ‘ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో.. ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని’ అన్నారు. ‘శ్రీలంక బోర్డు నుంచి ప్రస్తుతానికి మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ గురించి చర్చించడం సరైనది కాదని’ ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఐపీఎల్ నిర్వహణకు అవసరమైన వనరులు, వేదికలు తమవద్ద ఉన్నాయని, […]
కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తాము ఆతిథ్యం ఇస్తామన్న శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదనపై తాజాగా బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ‘ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో.. ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని’ అన్నారు. ‘శ్రీలంక బోర్డు నుంచి ప్రస్తుతానికి మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ గురించి చర్చించడం సరైనది కాదని’ ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఐపీఎల్ నిర్వహణకు అవసరమైన వనరులు, వేదికలు తమవద్ద ఉన్నాయని, శ్రీలంకలో కరోనా తీవ్రత పెద్దగా లేనందున.. ఇక్కడ ఐపీఎల్ నిర్వహించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ కోరిన విషయం తెలిసిందే.
Tags :IPL, Srilanka Cricket Board, Lock Down, BCCI