జులైలో ఇంగ్లాండ్ వేదికగా ఐపీఎల్?

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లను ఇంగ్లాండ్ వేదికగా జులైలో నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ సెకెండ్ పార్ట్ జూన్-జులై నెలల్లో నిర్వహించడానికి బీసీసీఐ, ఈసీబీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఒక నెల రోజు గ్యాప్ ఉన్నది. టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్చడం లేదా మ్యాచ్‌లు తగ్గించడం […]

Update: 2021-05-19 11:04 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లను ఇంగ్లాండ్ వేదికగా జులైలో నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ సెకెండ్ పార్ట్ జూన్-జులై నెలల్లో నిర్వహించడానికి బీసీసీఐ, ఈసీబీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఒక నెల రోజు గ్యాప్ ఉన్నది. టెస్టు సిరీస్ షెడ్యూల్ మార్చడం లేదా మ్యాచ్‌లు తగ్గించడం ద్వారా ఐపీఎల్‌కు విండోను ఏర్పాటు చేయాలని ఇరు క్రికెట్ బోర్డులు చర్చిస్తున్నాయి.

కేవలం బీసీసీఐ మాత్రమే కాకుండా బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కూడా ఇంగ్లాండ్ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్నది. టెస్టు సిరీస్‌లో మ్యాచ్‌లను కుదించడం లేదా షెడ్యూల్ మార్చడానికి ఈసీబీ కూడా సానుకూలంగా ఉన్నట్లు కథనంలో పేర్కొన్నారు. ఐపీఎల్ ఇంగ్లాండ్‌లో నిర్వహించడం వల్ల కౌంటీలకు కూడా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనే ఈసీబీ ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కంటే ముందే ఐపీఎల్‌ను ముగించాలని బీసీసీఐ భావిస్తున్న తరుణంలో ఇంగ్లాండ్ వేదికనే ఖరారు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..