HCU భూములు ఆ MP భర్తకు కట్టబెట్టే కుట్ర.. బీజేపీ ఎమ్మెల్యే మరో సంచలనం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) భూముల వివాదం నడుస్తోన్న వేళ తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఆ పార్టీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-04-01 10:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) భూముల వివాదం నడుస్తోన్న వేళ తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఆ పార్టీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. HCU భూములను ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) భర్త అయిన రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు కట్టబెట్టే కుట్రకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపాడని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి, సోనియా గాంధీ(Sonia Gandhi) దగ్గర మెప్పు పొందడానికి రూ.40 వేల కోట్ల భూమిని కేవలం రూ.20 వేల కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నాడని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.



కాగా, మరోవైపు.. కంచె గచ్చిబౌలి(Gachibowli)లోని 400 ఎకరాల భూమిపై ప్రస్తుతం వివాదం నెలకొన్న నేపథ్యంలో గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ప్రస్తావించడం కీలకంగా మారింది. ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేదని, ముమ్మాటికీ ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని దేశసర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పిందని ప్రభుత్వం గుర్తుచేస్తోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే భూమి వేలాన్ని ఆపాలని హైకోర్టును ఆశ్రయించిన వారికి నిరాశే మిగలనుందని సమాచారం.

Tags:    

Similar News