'పీఎం కేర్స్ ఫండ్'కు బీసీసీఐ రూ.51 కోట్ల విరాళం
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. కరోనాపై పోరాటానికి తమవంతు సాయం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘పీఎం కేర్స్ ఫండ్’కు రూ. 51 కోట్లు విరాళం ఇస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ మొత్తాన్ని బీసీసీఐ, రాష్ట్రాల అసోసియేషన్ల తరఫున అందజేయనున్నట్లు వారు ప్రకటించారు. దేశంలో కరోనా కట్టడికి అవసరమైన చర్యలు, బాధితులకు వైద్యం, వైద్యులు, నర్సులకు అవసరమైన రక్షణ సామగ్రి కొనుగోలుకు ఉపయోగించవచ్చని […]
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. కరోనాపై పోరాటానికి తమవంతు సాయం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘పీఎం కేర్స్ ఫండ్’కు రూ. 51 కోట్లు విరాళం ఇస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ మొత్తాన్ని బీసీసీఐ, రాష్ట్రాల అసోసియేషన్ల తరఫున అందజేయనున్నట్లు వారు ప్రకటించారు. దేశంలో కరోనా కట్టడికి అవసరమైన చర్యలు, బాధితులకు వైద్యం, వైద్యులు, నర్సులకు అవసరమైన రక్షణ సామగ్రి కొనుగోలుకు ఉపయోగించవచ్చని పేర్కొంది. ఇప్పటికే సచిన్ రూ. 50 లక్షలు, గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యం, రైనా రూ. 52 లక్షల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags : BCCI, Corona, Donation, PM Modi, ‘PM cares fund’