రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధం

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఉన్నతమైన పదవుల్లో రిటైర్డ్ అధికారులను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తక్షణమే వారిని తొలగించాలని, లేకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో గురువారం బీసీసంఘాల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పాలసీ నిర్ణయాలను అమలుచేసే కీలకమైన స్థానాల్లో పదవీ విరమణ చేసిన అధికారులను కొనసాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. జలమండలి, వ్యవసాయం, ఉద్యానవనం, […]

Update: 2020-07-23 09:36 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఉన్నతమైన పదవుల్లో రిటైర్డ్ అధికారులను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తక్షణమే వారిని తొలగించాలని, లేకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో గురువారం బీసీసంఘాల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పాలసీ నిర్ణయాలను అమలుచేసే కీలకమైన స్థానాల్లో పదవీ విరమణ చేసిన అధికారులను కొనసాగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. జలమండలి, వ్యవసాయం, ఉద్యానవనం, నీటిపారుదల, ట్రాన్స్‌కో, జెన్‌కో, సంక్షేమ శాఖల్లోని ఉద్యోగాల్లో విశ్రాంత అధికారులే కొనసాగుతున్నారన్నారు.

Tags:    

Similar News