బీజేపీకి బీసీలు వెన్నుదన్నుగా నిలిచారు

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో భారతీయ జనతా పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా నిలిచారని, అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి బీసీలే కారణమని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఉన్న ఓబీసీలను బీజేపీకి దగ్గర చేయాలనే లక్ష్యంతో పనిచేయబోతున్నామని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను వారికి అందించే దిశగా ఒక ప్రణాళికా బద్దంగా పని చేయబోతున్నట్టు వెల్లడించారు. బీసీల అభ్యున్నతికి బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్దత […]

Update: 2020-10-08 10:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో భారతీయ జనతా పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా నిలిచారని, అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి బీసీలే కారణమని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఉన్న ఓబీసీలను బీజేపీకి దగ్గర చేయాలనే లక్ష్యంతో పనిచేయబోతున్నామని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను వారికి అందించే దిశగా ఒక ప్రణాళికా బద్దంగా పని చేయబోతున్నట్టు వెల్లడించారు. బీసీల అభ్యున్నతికి బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్దత కల్పించడంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత ప్రధాని మోడీ ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొన్నారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే భావిస్తూ వచ్చిందని విమర్శించారు.

బీసీలను వర్గీకరించేందుకు ఏర్పాటు చేసిన రోహిణి కమిషన్ జనవరిలో తమ రిపోర్ట్ అందిస్తుందనీ, కమిషన్ సిఫారసులను అమలు చేయడం ఖాయమని డా.లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీహార్, బెంగాల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. నూతన సంస్కరణలతో పారదర్శకత పాలన అందించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుండగా, విపక్ష, ప్రాంతీయ పార్టీలు అది జీర్ణించుకోలేక అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. డిస్కంలను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అసహనం వ్యక్తంచేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నామనీ, జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.

Tags:    

Similar News