బీసీలంటే బిచ్చగాళ్లు కాదు.. ప్రభుత్వంపై శ్రీనివాస్ గౌడ్ ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలంటే బిచ్చగాళ్లం కాదని, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన హక్కుల కోసం నిజాయితీగా పోరాడుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో బుధవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాజుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ర్టం ఏర్పాటు కోసం కాసోజు శ్రీకాంత్ నుంచి కానిస్టేబుల్ కిష్టయ్య […]

Update: 2021-09-08 11:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలంటే బిచ్చగాళ్లం కాదని, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన హక్కుల కోసం నిజాయితీగా పోరాడుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో బుధవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాజుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ర్టం ఏర్పాటు కోసం కాసోజు శ్రీకాంత్ నుంచి కానిస్టేబుల్ కిష్టయ్య వరకు త్యాగాలు మావైతే, బోగాలు అగ్రకులాల వారు పొందుతున్నారన్నారు. ఓట్లు మావైతే, సీట్లు టీఆర్ఎస్ పార్టీ వాళ్లు అనుభవిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 4 లక్షల కోట్లు అప్పు చేస్తే దానిలో బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్లను కేటాయించగా, గడిచిన ఏడేళ్లలో కేవలం రూ.7 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేయడం దారుణమన్నారు. అడుగడును బీసీలను అణిచి వేస్తున్నారన్నారు. బీసీ సంక్షేమానికి ప్రత్యేక నిధులు కొరకు సీఎం కేసీఆర్ అడగడు, పీఎం మోడీ ఇవ్వరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోనే బీసీలంతా ఏకదాటిపైకి వచ్చి రాజ్యాధికారం కోసం కృషి చేస్తామన్నారు. ఇప్పటికే రాజకీయ వేధిక కొరకు ప్రయత్నిస్తున్నామన్నారు. బీసీ వేదిక కోసం 132 సంఘాలను ఆవిర్భావం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ మేరకు డిసెంబరులో లక్ష మందితో బీసీల రాజకీయ ప్లీనరిని నిర్వహిస్తామన్నారు.

ఈ సమవేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ ముఖ్య నేతలను ఆహ్వానిస్తామన్నారు. దీంతో పాటు బీసీలకు రాజకీయ ఉద్యమానికి మద్ధతుగా మాసపత్రిక, యూ ట్యూబ్ చానల్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో పాటు బీసీ వేదిక ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విరాళాలు సేకరించి, సభ్యత్వాలను కూడా నమోదు చేయిస్తామన్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమానికి 14 రకాల అంశాలను తీర్మానించడం జరిగిందన్నారు. వీటిలో ప్రధానంగా జనాభా దమాషా ప్రకారం 27 నుంచి 50 శాతానికి రిజర్వేషన్ల పెంపు, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, గిరిజన, ఆదివాసీ, సంచార, మైనార్టీ , వికలాంగుల బంధును అమలు వంటివి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల బీసీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News