కరీంనగర్‌ వేదికగా బీసీల గర్జన.. ఈనెల 26న బీసీ సమ్మేళనం

దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్​ జిల్లాలో ఈనెల 26వ తేదీన బీసీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ యువ నేత మంద అమర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దేశ నిర్మాణంలో ఎనలేని సేవలు చేసి, గుర్తింపునకు నోచుకోని బీసీల సంక్షేమమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా, ఆయా వర్గాల […]

Update: 2021-12-23 09:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్​ జిల్లాలో ఈనెల 26వ తేదీన బీసీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ యువ నేత మంద అమర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దేశ నిర్మాణంలో ఎనలేని సేవలు చేసి, గుర్తింపునకు నోచుకోని బీసీల సంక్షేమమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా, ఆయా వర్గాల ప్రజలకు టీఆర్ఎస్​ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటివో జనాభా లెక్కల ప్రకారం బీసీల స్థితిగతులను అంచనా వేస్తోందని, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించడానికి బీసీ జనగణన చేయాలని డిమాండ్​చేశారు. బీసీ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్లు దేవోళ్ల గంగాధర్, సదుర్ల మల్లేశం పాల్గొంటారని తెలిపారు.

Tags:    

Similar News